azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

chitra - nallani vannio (from "chatrapathi") lyrics

Loading...

నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా…
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా?

జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది
మమతకే తగనని తొలిసారి తెలిసింది

నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా…
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా?

నీ కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్న
అంతులేని కడలిలోతుని నేను చూస్తున్నా
కడుపులో నిను మోయకున్నా
అమ్మ తప్పును కడుపులోన దాచుకున్న నిన్ను చూస్తున్నా
జరగనే జరగదు ఇకపైన పొరపాటు
నమ్మరా… అమ్మని .నీ మీద నా ఒట్టు…

నల్లనివన్నీ నీళ్ళనీ తెల్లనివన్నీ పాలని
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా…
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా?

తప్పటడుగులు వేసిన తల్లిగా విసిరేసిన
ఈ దారితప్పిన తల్లిని వదిలేయకు
చచ్చిపుడతా నాయనా బిడ్డగా నీ కడుపున
జరగనే జరగదు ఇకపైన పొరపాటు
నమ్మరా… అమ్మని .నీ మీద నా ఒట్టు…

నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని
అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా…
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా?



Random Lyrics

HOT LYRICS

Loading...