haricharan - oorikey ala lyrics
ఊరికే అలా ఊపిరాపకే
ఉన్నప్రేమను లేదంటూ ఉరితీయకే
కోపమా నామీదే
సొంతవాడితో పంతమెందుకే
నా మనస్సును దూరంగ విసిరేయకే
నేరమేం చేసిందే
ప్రాణంగా నిన్నే ప్రేమించానే
బాణంలా గాయం చెయ్యొద్దే నువ్వుండే గుండెలో
ఊరికే అలా ఊపిరాపకే
ఉన్నప్రేమను లేదంటూ ఉరితీయకే
కోపమా నామీదే
పెదాలపైన పదాలుకాని
నిజాన్ని చూసాను నీ కళ్లలో
ఎదంత నన్నే దాచావుగాని
అబద్దమంటావు ఈ వేళలో
అంతులేనంత ప్రేమంతా ఏదే
ఇపుడు ఏ కొంచెమో కానరాదే
నటనలు వదలవే
నిన్నటిలా నువ్వు లేవే
ప్రాణంగా నిన్నే ప్రేమించానే
బాణంలా గాయం చెయ్యొద్దే నువ్వుండే గుండెలో
ఊరికే అలా ఊపిరాపకే
ఉన్నప్రేమను లేదంటూ ఉరితీయకే
కోపమా నామీదే
వీడుకోలని నిన్ను వీడినా
వాడిపోదులే ఎదలోని నీ సంతకం
నువ్వు నా జీవితం
(జీవితం)
ఓ’ ఒంటిదారిలో జంటనీడగా
తోడు ఉండదా ఇన్నాళ్ళ నీ జ్ఞాపకం
మరువదే నా ప్రాణం
(ప్రాణం)
అనుకుంటే అన్నీ జరిగేదెలా (జరిగేదెలా)
నిజమయ్యే వీలే లేకున్నా
నీ కలలో జీవించనా
(జీవించనా)
ఊరికే అలా ఊపిరాపకే
ఉన్నప్రేమను లేదంటూ ఉరితీయకే
కోపమా నామీదే
(జీవించనా)
(జీవించనా)
Random Lyrics
- iron savior - eye to eye (2017 version) lyrics
- jimbo_jim - el dorado lyrics
- hoosh - stuck lyrics
- fizz - so low lyrics
- k-rak - mi nombre lyrics
- puff daddy & faith evans - i'll be missing you lyrics
- viper - grind to shine time lyrics
- moreno mc - l'interruttore generale (canzone d'autore) lyrics
- duals - first love lyrics
- the chamanas - el cauca lyrics