kala bhairava feat. nani & shraddha srinath - spirit of jersey lyrics
అణిగిమణిగిన అలలిక ఎగసెను చూడరా
అసలు అవధులు లేవురా
అలుపు దరికిక చేరనీక ఆడరా
మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా
పగలు మెరుపులు చూపరా
వయసు సగముగ మారిపోయి ఓడెరా
గెలుపే అడుగడుగునా
వెలుగే నిను అలమెనా
దిగులే పడె మరుగున
మొదలే ఇక సమరమా
పడినా బెదరక పదా
పరుగే విజయం కదా
ఉరికే చెమటల నదై కదిలెనులే
తగలగ మేఘమే
ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమే
అడుగులో చూపటానికే
మరిచిన తారవే
ముసుగిక నేడు వీడెలే
పరుగుల దాహమే
బరువిక తేలికాయెలే
అణిగిమణిగిన అలలిక ఎగసెను చూడరా
అసలు అవధులు లేవురా
అలుపు దరికిక చేరనీక ఆడరా
మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా
పగలు మెరుపులు చూపరా
వయసు సగముగ మారిపోయి ఓడెరా
గమనాలనే… గమనించరా…
గమనాలనే గమనించరా
ఒక రోజు గమ్యమెదురవదా
గగనాలనే గురి చూడరా
మరి నేల నీకు వశమవదా
గమనాలనే గమనించరా
ఒక రోజు గమ్యమెదురవదా
గగనాలనే గురి చూడరా
మరి నేల నీకు వశమవదా
పిడుగు వలెనే పడుతు కలుపు
ఇక ఈ నింగి నేల
ఉరుము మెరుపు బరిలో నిలుపు
ఇక అంతా నీదేరా
అడుగు కదుపు జయము జగము
నీ సొంతం అయ్యేలా
విధికి ఎదురు నిలిచి గెలిచి
నీ పంతం చూపేలా
తగలగ మేఘమే
ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమే
అడుగులో చూపటానికే
మరిచిన తారవే
ముసుగిక నేడు వీడెలే
పరుగుల దాహమే
బరువిక తేలికాయెలే
అణిగిమణిగిన అలలిక ఎగసెను చూడరా
అసలు అవధులు లేవురా
అలుపు దరికిక చేరనీక ఆడరా
మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా
పగలు మెరుపులు చూపరా
వయసు సగముగ మారిపోయి ఓడెరా
గెలుపే అడుగడుగునా
వెలుగే నిను అలమెనా
దిగులే పడె మరుగున
మొదలే ఇక సమరమా
పడినా బెదరక పదా
పరుగే విజయం కదా
ఉరికే చెమటల నదై కదిలెనులే
తగలగ మేఘమే
ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమే
అడుగులో చూపటానికే
మరిచిన తారవే
ముసుగిక నేడు వీడెలే
పరుగుల దాహమే
బరువిక తేలికాయెలే
అణిగిమణిగిన అలలిక ఎగసెను చూడరా
Random Lyrics
- plácido domingo - el mundial lyrics
- forró noda de caju - nada me faz te esquecer lyrics
- celso fonseca - juventude lyrics
- skank - até o amor virar poeira lyrics
- audioslave - you know my name lyrics
- keny arkana - ils ont peur de la liberté lyrics
- os mateadores - brega demais lyrics
- lil dude - only option lyrics
- luan e vanessa - cenas de ciúme lyrics
- j. neto - eu e você lyrics