m. m. keeravani feat. sunitha upadrashta - noonoogu meesalodu lyrics
డ డడ డి డిడి డు డుడుడూ డ డడ డిడిడి డు
నూనూగు మీసాలోడు నీ ఈడు జోడైనోడు నీవైపె వస్తున్నాడు డు
కళ్లల్లో కసి ఉన్నోడు కండల్లో పస ఉన్నోడు వచ్చేసాడొచ్చేసాడు డు
నన్ను ఏం చేస్తాడొ ఏమొ ఈనాడు
జొన్న పొత్తుల తోటి గూడె కట్టి ఏం చేస్తాడు ఇచ్చేస్తాడు
నూనూగు మీసాలోడు నీ ఈడు జోడైనోడు నీవైపె వస్తున్నాడు
చెంగు చాటు బిందె పెట్టి చెరువుకాడికొస్తుంటె
చెంతకొచ్చి ఆరా తీస్తాడు
బిందె నిండి పోయిందంటె బరువు మోయ్యలేవంటు సాయం చేస్తె తప్పేంటంటాడు
సాయమేమి కాదోయ్ చెయ్యి కొంత జరిపి నడుముకి పైపైనె ఆనిస్తాడు
తస్సదియ్య అత్త తట్టలేదె పిట్ట ఇకపై ఆ పనినే కానిస్తాడు
పెద్ద దొంగోడమ్మ బాబోయ్ బుల్లోడు
ఇంత బంగారమె ముందె ఉంటె ఏం చేస్తాడు దోచేస్తాడు
నూనూగు మీసాలోడు నీ ఈడు జోడైనోడు నీవైపె వస్తున్నాడు డు
కళ్లల్లో కసి ఉన్నోడు కండల్లో పస ఉన్నోడు వచ్చేసాడొచ్చేసాడు డు
ఇంక ఏం చేస్తాడొ మళ్ళి ఈనాడు
లంకెబిందెల్లోన పాలె పోసి అబ్బొ ఏం చేస్తాడు తోడేస్తాడు
ఓ రోజు రేయిపూట సినిమా హాల్లొ రెండొ ఆటకెళ్లాక
సీటు ఇచ్చి కూర్చోమన్నాడు సచ్చినోడు
పాపమేమి చేసాడండి పల్లెటూరి చిన్నోడు
పాప్ కారన్ పొట్లాం ఇచ్చాడు
ఇచ్చినట్టె ఇచ్చి మీద మీద పోసి అరరె అరరె అని తడిమేసాడు
అమ్మ నంగనాచి నచ్చబట్టి కాద నవ్వి ఊరుకున్నావు నువ్వప్పుడు
ఎంత నాటోడైన వీడె నావోడు
ఇంత బంగారమె సొంతం ఐతె ఏం చేస్తాడు దాచేస్తాడు
నూనూగు మీసాలోడు నీ ఈడు జోడైనోడు నీవైపె వస్తున్నాడు డు
కళ్లల్లో కసి ఉన్నోడు కండల్లో పస ఉన్నోడు వచ్చేసాడొచ్చేసాడు డు
వీడు ఏం చేస్తాడొ తెలుసా ఈనాడు
కోడి కూరె చేసె కాలం నేడె వచ్చిందంటు కూర్చుంటాడు వంటింట్లోనె తిష్టేస్తాడు
Random Lyrics
- andres sierra - chosen lyrics
- plk - freestyle booska polak lyrics
- recuerdo rojo - no guardes ni un rincón lyrics
- jonathan ogden - perfect lyrics
- the papers - irradiation lyrics
- tori amos - chocolate song lyrics
- starro feat. bosco - fantasy lyrics
- mandrone - saint michel lyrics
- face - ты и сигареты (you and cigarettes) lyrics
- tori amos - breakaway lyrics