p. susheela - from "jayasudha" lyrics
గోరువెచ్చని సూరిడమ్మా.ఆ.ఆ.ఆ. పొద్దుపొడుపులో వచ్చాడమ్మా .ఆ.ఆ.ఆ
గోరువెచ్చని సూరిడమ్మా పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
వద్దన్నా.ఆ.అ రావద్దన్నా.ఆ… అ.అ
గు౦డెలో. గుడిసె వేసి అది గుడిగా చేసి ఆ గుడిలో… దాగున్నాడమ్మా
ఆ గుడిలో… దాగున్నాడమ్మా
గోరువెచ్చని సూరిడమ్మా.ఆ.ఆ.ఆ. పొద్దుపొడుపులో వచ్చాడమ్మా .ఆ.ఆ.ఆ
మిట్టమధ్యాహ్న౦ నడి నెత్తిన వచ్చాడు
మిట్టమధ్యాహ్న౦ నడి నెత్తిన వచ్చాడు
ఒ౦టరిగా పోతు౦టే ఎ౦టె౦ట పడ్డాడు
ఇనకు౦డా పొతు౦టే అరిచరిచి పిలిచాడు… ఆ.ఆహ.ఆ
పిలిచి పిలిచి అలుపొచ్చి పైకెక్కానన్నాడు
ఎతికి ఎతికి అలకొచ్చి ఏడెక్కానన్నాడు
ఆ ఏడి దిగాల౦టే నా తోడు కావాల౦ట
నేతోడు ఇస్తాన౦టే తను దిగి వస్తాడ౦ట.ఆ
గోరువెచ్చని సూరిడమ్మా.ఆ.ఆ.ఆ. పొద్దుపొడుపులో వచ్చాడమ్మా .ఆ.ఆ.ఆ
పొద్దుగూకేయేళ ఎదురుగా వచ్చాడు
పొద్దుగూకేయేళ ఎదురుగా వచ్చాడు
ఎనుతిరిగిపోతు౦టే ఎనకెనక పిలిచాడు
పోని అని తిరిగితేఎరుపెక్కి ఉన్నాడు.అ.అ.అ
ఆగి ఆగి అగలేక దిగి వచ్చానన్నాడు
చూసి చూసి మత్తెక్కి పిచ్చెక్కి౦దన్నాడు
ఆ పిచ్చి దిగాల౦టే నా తోడు కావాల౦ట
నే తోడు ఇస్తాన౦టే పొమ్మన్నాపోడ౦ట.ఆ
గోరువెచ్చని సూరిడమ్మా.ఆ.ఆ.ఆ. పొద్దుపొడుపులో వచ్చాడమ్మా .ఆ.ఆ.ఆ
వద్దన్నా.ఆ.అ రావద్దన్నా.ఆ… అ.అ
గు౦డెలో. గుడిసె వేసి అది గుడిగా చేసి ఆ గుడిలో… దాగున్నాడమ్మా
ఆ గుడిలో… దాగున్నాడమ్మా
గోరువెచ్చని సూరిడమ్మా.ఆ.ఆ.ఆ. పొద్దుపొడుపులో వచ్చాడమ్మా .ఆ.ఆ.ఆ
Random Lyrics
- gucci mane - icy lil bitch lyrics
- 17.28 - sukob na lyrics
- william bell - eloise (hang on in there) lyrics
- brennan heart - fire in the sky lyrics
- мэйти feat. alphavite - красный дракон lyrics
- orco - art attack lyrics
- carmon - rykker lyrics
- gucci mane - out the zoo lyrics
- luna comet - that place lyrics
- nesim najih - beter voor je lyrics