
s.p. balasubrahmanyam & chitra - a ale ranattu lyrics
చిత్రం: రౌడీగారి పెళ్ళాం (1991)
సంగీతం: బప్పీ లహరి
సాహిత్యం: సిరివెన్నెల
అ ఆ లే రానట్టు అలవాటే లేనట్టు అట్టా అటు పక్కకు చూడొద్దు
ఇట్టే అందేటట్టు ఇచ్చానే నా గుట్టు నటనెందుకు అర్ధం కానట్టు
హే ఉలుకు దేనికి ఉఁ అనమంటే జగడమాడకు జతకమ్మంటే
తగునా మగడా రగడా హ హా
నసపెట్టకు నా చుట్టూ పనియేమి లేనట్టు ఓపిగ్గా ఉండను ఈ పట్టు
మొనగత్తెవు అనుకుంటూ మన సంగతి విననట్టు మొదలెట్టకు నాతో కసరత్తు
చెప్పలేదని అనుకోవద్దు చుప్పనాతి చెడిపోవద్దు
మెడతా పెడతా మడతా హ హా
అ ఆ లే రానట్టు అలవాటే లేనట్టు అట్టా అటు పక్కకు చూడొద్దు హా
అరెరె రరె రెరె నీకు నాకు లింకేశాడు పైవాడు
నూరారైనా నూరేళ్లయిన తెగనీడు
ఆఁ హహా హే హేహే చాలదూరం వెళ్లిందమ్మా యవహారం
చాలించమ్మ ఎర్రెక్కించే ఎటకారం
హే వేస్తాను చూడు నీ ముక్కుతాడు నా గుండెల్లో ఉంది నీ గూడూ
చూడు నీ జోడు సయ్యాడు హో
నసపెట్టకు నా చుట్టూ పనియేమి లేనట్టు ఓపిగ్గా ఉండను ఈ పట్టు
ఓ అ ఆ లే రానట్టు అలవాటే లేనట్టు అట్టా అటు పక్కకు చూడొద్దు
హో హో ప్రేమా గీమా అంటే నాకు పడవమ్మా
వద్దే మొర్రో అంటే మాట వినవమ్మా
ఓ హోహో ఓ హోహో రాసేశాడే ఎట్టా మరి ఆ బ్రహ్మ
రాజీకొచ్చి లాగించేద్దాం ఈ జన్మా
హే రెచ్చిపోకే ఆడ బొమ్మ రేగానంటే ఆగవులేమ్మా
చిలకా గిలకా పలకా…
అ ఆ లే రానట్టు అలవాటే లేనట్టు అట్టా అటు పక్కకు చూడొద్దు
ఆ మొనగత్తెవు అనుకుంటూ మన సంగతి విననట్టు మొదలెట్టకు నాతో కసరత్తు
ఓ ఉలుకు దేనికి ఉఁ అనమంటే జగడమాడకు జతకమ్మంటే
హే… ఓ… హ…
Random Lyrics
- park kyung - ogeulogeul lyrics
- volkan - kind dieser erde lyrics
- volodia - les gens qui passent lyrics
- robyn hitchcock - cool bug rumble lyrics
- robyn hitchcock - harry's song lyrics
- beach moon/peach moon - answer tide lyrics
- oh won bin - c'mon girl lyrics
- d'shaun - revelation lyrics
- justin tang / lin-manuel miranda - 我這發 (my shot) lyrics
- dragonette & mike mago - secret stash lyrics