s.p. balasubrahmanyam & chitra - chitapata chinuku la lyrics
చిటపట చినుకుల తాళం
చిగురాకులలో హిందోళం
కిలకిల చిలకల మేళం
నను పిలిచిన తొలి భూపాలం
గలగల గాజుల గానం
నా మనసుకు నేర్పెను తానం
జలజల వాగుల రాగం
నా వయసుకు నేర్పెను వేగం.
ప్రతి కదలిక సంగీతం నేర్పుతున్నదీ
సరిగమలతొ సావాసం చేయమన్నదీ
నీ మాటలే నా పాటలై
కచేరి చేయాలి కాలం…
east west north south అన్నిచేరితే
డోరెమీకి సాపసాకి తేడాలేదు భాయ్
జావళీకి జాస బీటు జంట కలిపై
జోరా జోరి స్వింగ్ మీద జాలి జాలి హోయ్
చిటపట చినుకుల తాళం
చిగురాకులలో హిందోళం
గలగల గాజుల గానం
నా మనసుకు నేర్పెను తానం…
కిచన్ లోని కుక్కర్ ఈల వింటే
డైనింగ్ టేబుల్ కీబోర్డ్ అవదా
వేడి వేడి వంట పాత్రలన్నీ
ఆర్కెష్ట్రాగా మ్యూజిక రాదా
తగిలిన గాలికి తలుపుల కర్టన్ తలూపుతుంటే
వినగల వారికి తెలియకపోదులె మెలోడి అంటే.
తలగడ మీదకి వాలగానె తలపుల తిల్లానా
మొదలవుతుంది హాయ్ లయపైనా…
ఇదిగో ఇపుడే. ఆ వరాల పాటను వరించుదామా…
east west north south అన్నిచేరితే
డోరెమీకి సాపసాకి తేడాలేదు భాయ్
జావళీకి జాస బీటు జంట కలిపై
జోరా జోరి స్వింగ్ మీద జాలి జాలి హోయ్
చిటపట చినుకుల తాళం
చిగురాకులలో హిందోళం
గలగల గాజుల గానం
నా మనసుకు…(smile,)
చిన్ననాటి అమ్మ జోలపాటే నాతో పాటే ఎదిగిందేమో
విన్న వారి కంటిరెప్పపైనే వాలి లాలి అంటుందేమో.
ప్రతి హృదయానికి పరుగులు నేర్పద హుషారు నాదం.
పగలని రేయని తెలియని చోటికి షికారు పోదాం.
పరవశమయ్యే శ్వాసలన్నీ మురళిగ మారేలా
పలికిందీ నా పాట ఈవేళా…
యమునా… నదినై ఆ స్వరముల నావని నడిపించేదా…
east west north south అన్నిచేరితే (అ)
డోరెమీకి సాపసాకి తేడాలేదు భాయ్
జావళీకి జాస బీటు జంట కలిపై
జోరా జోరి స్వింగ్ మీద జాలి జాలి హోయ్
చిటపట చినుకుల తాళం
చిగురాకులలో హిందోళం
గలగల గాజుల గానం
నా మనసుకు నేర్పెను తానం.
ప్రతి కదలిక సంగీతం నేర్పుతున్నదీ
సరిగమలతొ సావాసం చేయమన్నదీ
నీ మాటలే నా పాటలై
కచేరి చేయాలి కాలం…
చిటపట చినుకుల తాళం
చిగురాకులలో హిందోళం
గలగల గాజుల గానం
నా మనసుకు నేర్పెను తానం…
కిలకిల చిలకల మేళం
నను పిలిచిన తొలి భూపాలం
జలజల వాగుల రాగం
నా వయసుకు నేర్పెను వేగం.
Random Lyrics
- crumb - bones lyrics
- old again - set fire lyrics
- álvaro tito - cristo é vida lyrics
- wiwek - cavalry lyrics
- 박경 - 오글오글 lyrics
- bizzey - doe je dans lyrics
- fuoricontrollo - la musica sta cambiando lyrics
- 葉璦菱 - 傲慢與偏見 (pride and prejudice) lyrics
- sharon cuneta - hanggang saan lyrics
- yıldız tilbe - yemin mi ettin? lyrics