azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

s.p. balasubrahmanyam - anantha mahima lyrics

Loading...

ఈ అనంత కాల గమనంలో
ఈ రవ్వంత జీవన పయనంలో
అందరు నీవారూ.అందరు నీవారు.

చివరకు మిగిలేదెవరు లేరు

ఈ అనంత కాల గమనంలో… ఓ…

నీ కడుపున చీకటి దాచుకొని
కన్నీరే చమురుగ చేసికొని

నీ కడుపున చీకటి దాచుకొని
కన్నీరే చమురుగ చేసికొని…

నీ కొర్కెలు నిలువునా కాల్చుకొని
వెలుగును పంచావందరికీ
నీ వేదన తెలిసిందెవరికి
నీ వేదన తెలిసిందెవరికీ…

ఈ అనంత కాల గమనంలో…
ఈ రవ్వంత జీవన పయనంలో…
అందరు నీవారు.చివరకు మిగిలేదెవరు లేరు

చేతికి తమ్ముడు అందోస్తాడని
చెట్టుకు తానొక వేరౌతాడని

చేతికి తమ్ముడు అందోస్తాడని…
చెట్టుకు తానొక వేరౌతాడని

చేసిన త్యాగం చేయి దాటిందా
రెక్కలు వస్తే అంతేనమ్మా
నీ రెక్కలే నీకు శాశ్వతమమ్మా
నీ రెక్కలే నీకు శాశ్వతమమ్మా

ఈ అనంత కాల గమనంలో…
ఈ రవ్వంత జీవన పయనంలో…
అందరు నీవారు.చివరకు మిగిలేదెవరు లేరు

నీ అలసట తీర్చే ఓడి ఒకటుందని
నీ అనురగనికి గుడి తాననుకొని

నీ అలసట తీర్చే ఓడి ఒకటుందని
నీ అనురగనికి గుడి తాననుకొని
వేచావమ్మా ఆశలు దాచుకొని.

దేవుడు తలుపులు మూసడా.అ… అ.అఅ
దేవుడు తలుపులు మూసడా…
నీ దీపం నేటితో కొండెక్కిందా

ఈ అనంత కాల గమనంలో… ఓ…

ఈ రవ్వంత జీవన పయనంలో… ఓ…

అందరు నీవారు.అందరు నీవారు.చివరకు మిగిలేదెవరు లేరు.

అందరి నొసలు ఒకటేనమ్మా
అందలి రాతలు వెరౌనమ్మా.్్

అందరి నొసలు ఒకటేనమ్మా…
అందలి రాతలు వెరౌనమ్మా

కొందరి బ్రతుకులు అందరి కోసమని
రాసినివాడికే తెలియాలి

కధ ముగింపు వాడే తేల్చాలి
కధ ముగింపు వాడే తేల్చాలి

ఈ అనంత కాల గమనంలో… ఓ.
ఈ రవ్వంత జీవన పయనంలో… ఓ…
అందరు నీవారూ.అందరు నీవారు.
చివరకు మిగిలేదెవరు లేరు



Random Lyrics

HOT LYRICS

Loading...