s.p. balasubrahmanyam - ankitham neeke ankitham lyrics
అంకితం నీకే అంకితం …అంకితం నీకే అంకితం
నూరేళ్ళ ఈ జీవితం
అంకితం నీకే అంకితం
ఓ ప్రియా ఆ ఆ ఆ
ఓ ప్రియా ఓ ప్రియా.
కాళిదాసు కలమందు చిందు
అపురూప దివ్య కవిత
త్యాగరాయ కృతులందు వెలయు
గీతార్ద సార నవత
నవవసంత శోభనా మయూఖ
లలిత లలిత రాగ చంద్రలేఖ
స్వరమూ స్వరమూ
కలయికలో ఒక రాగం పుడుతుంది
మనసు మనసు
కలయికలో అనురాగం పుడుతుంది
స్వరమూ స్వరమూ
కలయికలో ఒక రాగం పుడుతుంది
మనసు మనసు
కలయికలో అనురాగం పుడుతుంది
ఆ అనురాగం ఒక ఆలయమైతే
ఆ ఆలయ దేవత నీవైతే
ఆ ఆలయ దేవత నీవైతే
గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం
అంకితం నీకే అంకితం
లోకవినుత జయదేవ
శ్లోక శృంగార రాగదీప
భరత శాస్త్ర రమణీయ
నాద నవ హావ బావ రూప
స్వరవిలాస హాస చతుర నయన
సుమ వికాస బాస సుందర వదన
నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది
ప్రేమా ప్రేమా కలయికతో ఒక ప్రణయం పుడుతుంది
నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది
ప్రేమా ప్రేమా కలయికతో ఒక ప్రణయం పుడుతుంది
ఆ ప్రణయం ఒక గోపురమైతే
ఆ గోపుర కలశం నీవైతే
ఆ గోపుర కలశం నీవైతే
పుష్పం పత్రం ధూపం దీపం సర్వం అంకితం
అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం
అంకితం నీకే అంకితం
ఓ ప్రియా ఆ ఆ ఆ… ఓ ప్రియా ఓ ప్రియా.
Random Lyrics
- michael crawford - maria (west side story) lyrics
- k hoody - run it lyrics
- steve watson - maria (west side story) lyrics
- horacio guarany - la palomita lyrics
- kollegah - voulez vous coucher avec mois lyrics
- sheldon allman - free fall lyrics
- chila jatun - amor por siempre lyrics
- knesiyat hasechel - meal hayam lyrics
- filipek - księżniczki i smoki lyrics
- queen bri - nothing lyrics