azlyrics.biz
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

s. p. balasubrahmanyam - kanti choopu chaalunayya lyrics

Loading...

ఊరు దిష్టి వాడ దిష్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి
నరుల దిష్టి పరుల దిష్టి మనిషి దిష్టి మాను దిష్టి
తల్లి దిష్టి చెల్లి దిష్టి అసలు దిష్టి కొసరు దిష్టి

కాటుకలా కరగనీ పారసిలా రగలనీ
చీకటులే తొలగనీ చిరునవ్వులు విరియనీ…

కంటి చూపు చాలునయ్యా చిన్నరాయుడు
కంటి చూపు చాలునయ్యా చిన్నరాయుడు
కష్టమంతా తీరెనయ్యా చిన్నరాయుడు
నిన్ను కన్న ఊరు గొప్పదిరా చిన్నరాయుడు… ఓయి
కంటి చూపు చాలునయ్యా చిన్నరాయుడు
కష్టమంతా తీరెనయ్యా చిన్నరాయుడు
నీకు దిష్టి తీసి వెయ్యాలయ్యా చిన్నరాయుడు.అవును

సాక్ష్యులను సెట్ అప్ చేసే ఛాన్స్ లేదు మా ఊరిలో
వాయిదాల వకీళ్ళకి చోటు లేదు మా వాడలో
కొల్లగొట్టు కోర్టు కన్నా చక్కని తీర్పు నీదేనన్నా
అ ఆ ఇ ఈ చదువు కన్నా అన్నం పెట్టే చెయ్యే మిన్న
మాట తప్పిపోనివాడు రఘురాముడంటి మొనగాడు
చిన్నరాయుడంటి వాడు కోటికొక్కడైన లేనే లేడు
తన అండదండ ఉంటే చాలు ఊరికి ఎంతో మేలు
ఏ ఊళ్ళోనైనా ఇట్టాంటోడు ఒక్కడు ఉంటే చాలు

కంటి చూపు చాలునయ్యా చిన్నరాయుడు
కష్టమంతా తీరేనయ్యా చిన్నరాయుడు
నీకు దిష్టి తీసి వెయ్యాలయ్యా చిన్నరాయుడు

నాట్లు నాటే పిల్లగాలి పాటలలో నీవే…
ఏతమేసే రైతు బిడ్డ మాటలలో నీవే…
పైట వేసే కన్నెపిల్ల ఊహలలో నీవే…
మా గుండెలోన పొంగిపోయే ప్రేమలన్నీ నీవే. .
ఒళ్ళో… ఒళ్ళో… ఒళ్ళో.ఒళ్ళో
నాగలెత్తి పట్టుకుంటే చేను తుళ్ళిపోవునంట
కారు పడ్డ బంజరైనా పైడి పంట పండునంట
ఉన్నోడు లేనోడనే బేధాలేవీ రానీడయ్య
కన్నెర్ర చేసాడంటే దేవుడికైనా భయమేనయ్యా
మీసమున్న ప్రతివాడు చిన్నరాయుడంటి వాడు కాడు
పేదవాడికోసమైనా తన ప్రాణమిచ్చు దొర వీడు
తన అండా దండా ఉంటే చాలు ఊరికి ఎంతో మేలు
ఏ ఊళ్ళోనైనా ఇట్టాంటోడు ఒక్కడుంటే చాలు.

కంటి చూపు చాలునయ్యా చిన్నరాయుడు
కష్టమంతా తీరేనయ్యా చిన్నరాయుడు
నీకు దిష్టి తీసి వెయ్యాలయ్యా చిన్నరాయుడు
మ్మ్.మ్మ్…
కంటి చూపు చాలునయ్యా చిన్నరాయుడు
కంటి చూపు చాలునయ్యా చిన్నరాయుడు
కష్టమంతా తీరెనయ్యా చిన్నరాయుడు
నిన్ను కన్న ఊరు గొప్పదిరా చిన్నరాయుడు…



Random Lyrics

HOT LYRICS

Loading...