s. p. balasubrahmanyam, ramola & sadan - junior junior lyrics
జూనియర్ జూనియర్ జూనియర్
ఎస్ బాస్
ఇటు అటు కాని హృదయంతోటి
ఎందుకురా ఈ తొందర నీకు
ఇటు అటు కాని హృదయంతోటి
ఎందుకురా ఈ తొందర నీకు
అటు ఇటు తానొక ఆటబొమ్మని
తెలిసే ఎందుకు వలచేవు
అటు ఇటు తానొక ఆటబొమ్మని
తెలిసే ఎందుకు వలచేవు
ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ
గడ్డిపోచా నేనా హి హి హి హి
ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ
ఒద్దిక నదితో కోరేవు
ఒడ్డున పెరిగే గడ్డిపోచకు
హృదయం ఎందుకు వుండకూడదు
వుందని ఎందుకు ఒప్పుకోరాదు
రబ్బరు బొమ్మకు రాగం తెలుసు
ఆటబొమ్మకు ఆశలు తెలుసు
ఇద్దరు ఒక్కటె ఎందుకు కారదు
జూనియర్ జూనియర్ జూనియర్
ఇటు అటు కాని హృదయంతోటి
ఎందుకురా ఈ తొందర నీకు
సాగరమున్నా తీరనిది నీ దాహమురా
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా
ని మొహమురా హి హి హి హి
సాగరమున్నా తీరనిది నీ దాహమురా
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా
తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని
తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని
నీటిని చూసి దాహమువేస్తే తేనెకోసం తేటి వస్తే
పాపం గీపం అనడం ఛాదస్తం
నో ఇట్స్ బాడ్
బట్ ఐ యాం మాడ్
మోడుకూడ చిగురించాలలి మూగమనసు కోరే కోర్కెను
మోసం ద్రోహం అనడం అన్యాయం
హ హ హ హ
వాట్ పక పక పిక పిక
జూనియర్ జూనియర్ జూనియర్
ఎస్ బాస్
ఇటు అటు కాని హృదయంతోటి
ఎందుకురా ఈ తొందర నీకు
చైత్రము లోన చినుకు పడాలని కోరేవు
మార్గసిరాన మండుటెండకై చూసేవు
బాస్ లవ్ హస్ నో సీసన్, నాట్ ఈవన్ రీసన్
షట్ అప్
చైత్రము లోన చినుకు పడాలని కోరేవు
మార్గసిరాన మండుటెండకై చూసేవు
ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు
ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు
ఎండా వాన కలిసొస్తాయి
వెలుగు చీకటి కలిసుంటాయి
జరగని వింతలు ఎన్నో జరిగాయి
ఇట్ ఇస్ హైలీ ఇడియాటిక్
నో బాస్, ఇట్ ఇస్ పుల్లీ రొమాంటిక్
పాట పాడెను ముద్దుల బొమ్మ
పక పక నవ్వేవెందులకమ్మా
మనసున వున్నది చెప్పీ నవమ్మా
మనసున వున్నది చెప్పీ నవమ్మా
ఇటు అటు కాని హృదయంతోటి
ఎందుకురా ఈ తొందర నీకు
జూనియర్ జూనియర్ జూనియర్
ఇటు అటు కాని హృదయంతోటి
ఎందుకురా ఈ తొందర నీకు
Random Lyrics
- propellerheads - history repeating (featuring miss shirley bassey) lyrics
- banda el recodo - sin respiración lyrics
- barry mcguire - the servant king lyrics
- manoj peiris - nil ahas tale lyrics
- zach alwin - we could be free lyrics
- bone thugs-n-harmony - the originators lyrics
- coraje lyrics lyrics
- 林俊傑 - feat.王力宏 lyrics
- various artists - party your body lyrics
- banda el recodo - somos ajenos lyrics